• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

MNCL: కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూల ప్రదీప్ రెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 04:12 PM IST

శాశ్వత పరిష్కారం దిశగా సీసీ రోడ్ల నిర్మాణం

RR: హయత్ నగర్ డివిజన్‌లోని రంగనాయకుల గుట్ట కాలనీలో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు.

March 16, 2026 / 04:11 PM IST

అక్రమ ఇసుక ట్రాక్టర్ సీజ్: సీఐ

BDK: అశ్వాపురం మండలం చింతిర్యాల గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం మధ్యాహ్నం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతిర్యాల గోదావరి నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న డ్రైవర్ లంక సాయిరాం నుంచి ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

March 16, 2026 / 04:10 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ ఉచిత టీకాలు వేశారు. పశువైద్య సిబ్బంది డాక్టర్ పీ. శ్రీ ప్రియ, కే. సంధ్య (LSA), నాగరాజు, నారాయణ, రాంకుమార్, చంద్రయ్య, అంజి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 48 ఆవులు, ఎద్దులు, 32 గేదెలకు టీకాలు వేశారు. సర్పంచ్ కుమ్మరి మహేశ్వరి పాల్గొన్నారు.

March 16, 2026 / 04:09 PM IST

జనగణన–2027పై అధికారులకు శిక్షణ

MLG: దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా గణన–2027 కీలకమని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సంబంధిత అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయానికి చెందిన అధికారులు హోబాలాల్, సరళ గణన ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు తహసీల్దారులు పాల్గొన్నారు.

March 16, 2026 / 04:08 PM IST

బాక్స్ క్రికెట్ తొలగించాలని వినతి

KNR: 5వ వార్డు రజ్విచమన్ ప్రాంతంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టులను వెంటనే తొలగించాలని కోరుతూ సోమవారం బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ‘క్రిక్ ఫిల్డ్’, ‘క్రిక్ ఫిల్డ్ ప్రీమియం’ పేర్లతో ఇళ్ల మధ్య శాశ్వత కోర్టులు ఏర్పాటు చేసి, రేయింబవళ్లు క్రికెట్ ఆడుతుండటంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని వాపోయారు.

March 16, 2026 / 04:04 PM IST

ఎరువుల దుకాణాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

GDWL: నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. సోమవారం గద్వాలలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను ప్రతిరోజూ బోర్డుపై ప్రదర్శించాలని, విక్రయాలన్నీ ఈ-పాస్ యంత్రం ద్వారానే జరగాలని ఆదేశించారు.

March 16, 2026 / 04:04 PM IST

సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే.. లైసెన్స్ రద్దు: ఎమ్మెల్యే

MBNR: వంట గ్యాస్ సిలిండర్లను డీలర్లు ఎవరైనా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని వారి డీలర్ షిప్‌ను రద్దు చేస్తామని MLA అనిరుధ్ రెడ్డి అన్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడడంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

March 16, 2026 / 04:01 PM IST

రామాయంపేట యువతికి బంగారు పతకం

MDK: నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన జమాల్పూర్ హీనా మాధురి బంగారు పతకం సాధించి సత్తా చాటింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం రాష్ట్ర కార్యదర్శి పోచయ్య, ఒమర్ అంతర్జాతీయ కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. 

March 16, 2026 / 04:01 PM IST

రాజ్యసభ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

KMR: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రజలకు మరింత సేవలందించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

March 16, 2026 / 04:00 PM IST

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ

NZB: జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మక్క సాగు జరిగిందని ఎంపీ అన్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

March 16, 2026 / 04:00 PM IST

ఉచిత న్యాయ సేవల కోసం మొబైల్ వ్యాన్ ప్రారంభం

WNP: మారుమూల ప్రాంతాలకు గ్రామ గ్రామానికి న్యాయ సేవ విస్తరించాలనే ఉదేశ్యంతో న్యాయ సేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ రజిని తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి ఉచిత న్యాయసేవలు, ఎలా అందజేయడం జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 16, 2026 / 04:00 PM IST

ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలి: బీజేపీ

BDK: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చండ్రుగొండ మండల బీజేపీ అధ్యక్షులు రఘుపతి రావు ఆరోపించారు. ఇవాళ BJP పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

March 16, 2026 / 03:58 PM IST

నూతన సీఐను కలిసిన మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

RR: శంకర్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ అలీని, శంకర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీ. జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 03:56 PM IST

మూడు రోజులు మార్కెట్ బంద్..!

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈ నెల 19, 21, 22 తేదీల్లో మూసివేయనున్నట్లు వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సోమవారం తెలిపారు. 19న ఉగాది పండుగ సెలవు, 21న రంజాన్ పండుగ సెలవు, 22న ఆదివారం వారాంతపు సెలవు కారణంగా మార్కెట్ బంద్ కానుంది. 20వ తేదీన మార్కెట్ యథావిధిగా ఉంటుంది. 23వ తేదీన మళ్లీ మార్కెట్ పునఃప్రారంభం కానుంది.

March 16, 2026 / 03:50 PM IST