• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జాతీయ రేసింగ్ పోటీల్లో బాసర IIIT విద్యార్థుల ప్రభంజనం

NRML: ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ‘ఇస్సీ సీజన్-13’ రేసింగ్ పోటీల్లో బాసర త్రిపుల్ ఐటీకి చెందిన ‘టీమ్ గరుడ’ ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. యాక్సిలరేషన్ విభాగంలో మొదటి స్థానాన్ని, డిజైన్ క్విజ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.

March 6, 2026 / 08:04 AM IST

స్కూటీ నడుపుతూ ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణం ఏర్పాట్లను, గురువారం రాత్రి ఆలయ జీవో రమాదేవి స్వయంగా స్కూటీ నడుపుతూ పరిశీలించారు. శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, భోజన వసతి, త్రాగునీరు, నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు, పరిశీలించారు.

March 6, 2026 / 08:01 AM IST

కూరగాయల మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన

KNR: హుజరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్‌లో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థలాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇంజనీర్ ఎల్లేష్ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ఆధునాతన మార్కెట్ యార్డు నిర్మించనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తౌటం జాన్సీ రాణి తెలిపారు.

March 6, 2026 / 07:58 AM IST

ఆవుపై చిరుత దాడి.. సీసీ కెమెరా ఫొటో

ADB: బోథ్ మండలంలోని కరత్వాడలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గంగయ్యకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

March 6, 2026 / 07:52 AM IST

ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

JN: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Surya Ghar Muft Bijli Yojana ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీ పథకాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

March 6, 2026 / 07:51 AM IST

అక్రమ గంజాయి రవాణా.. 20 ఏళ్ల జైలు శిక్ష

KMM: వెంకటపాలెం గంజాయి స్మగ్లింగ్ కేసులో నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఏప్రిల్ 7న వెంకటపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 194 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, నేరం నిరూపితం కావడంతో శిక్ష విధించింది.

March 6, 2026 / 07:49 AM IST

ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు: కలెక్టర్

PDPL: ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధార్ అప్డేషన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి విద్యార్థి అప్డేట్ ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్డు లేని విద్యార్థులకు అందేలా చూడాలని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఆధార్ కార్డు లేని వ్యక్తులను గుర్తించి, కార్డు జారీ చేయాలన్నారు.

March 6, 2026 / 07:48 AM IST

పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం

MBNR: అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత పేర్కొన్నారు. కొత్తూరులో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

March 6, 2026 / 07:43 AM IST

వేర్వేరు బైక్ చోరిల్లో దొంగల అరెస్ట్

NLG: చౌటుప్పల్ మండలంలో జరిగిన రెండు వేర్వేరు బైక్ చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాప్ ముందున్న స్లెండర్, ఇంటి ముందు పార్క్ చేసిన ఆక్టివా ఎలక్ట్రిక్ బైక్లను దొంగిలించిన నిందితులు బతుల మణి, తమ్మిశెట్టి పెద్దిరాజు, కందగట్ల కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు.

March 6, 2026 / 07:42 AM IST

ధారూర్ మండలంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సదస్సులు!

VKB: మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ధారూర్ మండలంలో ఇవాళ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఐ రఘురాం పర్యవేక్షణలో ధారూర్, నాగసముందర్ సహా పలు గ్రామాల్లో ఈ సదస్సులు జరగనున్నాయి. యువత పెడదారి పట్టకుండా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ భారీ ఎత్తున అవగాహన కల్పించనున్నారు.

March 6, 2026 / 07:38 AM IST

నేటి నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

JGL: పెగడపల్లి మండలంలో నేటి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా సంక్షేమ వంటి అంశాలపై మండలంలో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

March 6, 2026 / 07:38 AM IST

‘మార్చి 6 నుంచి స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు’

PDPL: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 100 రోజుల కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలో ఈ నెల 6 నుంచి ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాఘవపూర్ నందు కార్యక్రమం ప్రారంభించబడుతుందని పేర్కొన్నారు.

March 6, 2026 / 07:37 AM IST

పోలీసు అక్క సమాచారంతో బాల్యవివాహాల నిలిపివేత: SP

ADB: పోలీసు అక్క సమాచారంతో బాల్యవివాహాలను నిలిపివేయడం జరుగుతుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై పోలీసు అక్క ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100 లేదా 8712659953 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

March 6, 2026 / 07:31 AM IST

అదనపు కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు

NRML: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఫైజాన్ అహ్మద్ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి కలెక్టరేట్‌లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంఎన్నికల నిర్వహణలో ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.

March 6, 2026 / 07:30 AM IST

‘విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’

SDPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

March 6, 2026 / 07:30 AM IST