దివగంత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 100 స్మారక నాణెం విడుదల అయిన సంగతి తెలిసిందే.నిన్న ఈ అపురూప నాణేల ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. ఈ నాణెం (Coin)ఒక్కొక్కటి గరిష్ఠంగా రూ.4 వేల పైచిలుకు ధరకు మింట్ కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలను తొలి విడతలో 12 వేలు ముద్రించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ నాణేలు అందుబాటులోకి వచ్చిన తొలిరోజే భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాదు మింట్ కాంపౌండ్ (Mint compound) వద్ద ఎన్టీఆర్ నాణేల కోసం జనాలు బారులు తీరారు.
తమ వంతు వచ్చే వరకు ప్రజలు ఓపిగ్గా నిలుచుని ఎన్టీఆర్ నాణేలు సొంతం చేసుకుని మురిసిపోతున్నారు. మహనీయుడి పేరిట విడుదల చేసిన నాణేలకు ఈ స్థాయిలో స్పందన ఉండడంతో, కేంద్ర ప్రభుత్వం మలి విడత నాణేల ముద్రణ (Printing) ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణ(Telangana)తో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం అభిమానులు క్యూ లైన్లలో నిలబడి ఎన్టీఆర్ వంద నాణెం చేజిక్కించుకుంటున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి నాణెం కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేన్ని మూడు ధరల్లో నిర్ణయించి మింట్ అధికారులు అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ.4,050 గా ధరలు నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆ నాణాన్ని అమ్ముతున్నారు.