మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్ (Saratchandra Pawar) ఆకస్మికంగా బదీలీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ సీఎస్ శాంతికుమారి (Shantikumari) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త గళాలు రోజురోజుకు గట్టిగా వినిపిస్తున్నాయి. అసంతృప్తితో కొంతమంది పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ (MLA Rekhanayak) కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు.
బీఆర్ఎస్ (BRS) ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆమె నిర్ణయం తన కుటుంబంపై భారంగా పడనుందా అంటే తాజాగా జరిగిన ఓ పరిణామం చూస్తుంటే అలాగే కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్. డీజీపీ(DGP) కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ (కమాండ్ కంట్రోల్) ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను ఆయన స్థానంలో నియమించారు. తెలంగాణ(Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహబూబాబాద్ (Mahbubabad) ఎస్పీ ఆకస్మిక బదిలీ అయ్యారు. తక్కువ వ్యవధిలోనే ఎస్పీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.