Auto నడుపుతూ.. భార్యను పీహెచ్డీ చదివించిన భర్త.. ఎక్కడంటే..?
ఆటో నడుపుతూ ఇంటిని పోషిస్తూనే.. భార్యను ఉన్నత చదువు చదివించాడు. ఆమెతో పీహెచ్డీ చేయించి, ఉన్నత స్థాయిలో నిలిపాడు గుంటూరుకు చెందిన కరుణాకర్. అతని మంచితనాన్ని పలువురు కొనియాడుతున్నారు.
Husband Drove Auto: కొందరు భార్య, భర్తల మధ్య ఏదో విషయంలో గొడవ జరుగుతుంది. భర్త జాబ్ లేదా వ్యాపారం చేసిన అతివల్లో అసహనం.. మరికొందరు లేడీస్ జాబ్ చేస్తానంటే వద్దనే ప్రబుద్దులు ఉన్నారు. భార్యను చదివిస్తూ.. భర్త కూలీ నాలీ చేసేవారు అరుదు. అలాంటి కోవకు చెందుతారు కరుణాకర్ (karunakar).. తాను ఆటో నడుపుతూ.. భార్యను పీహెచ్డీ (phd) చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
గుంటూరు (guntur) జిల్లా తెనాలి (tenali) మండలం పెదరావూర్ (karunakar) గ్రామానికి చెందిన ఈపూరి షీల (sheela) గురించే మనం ఇందాకా చెప్పుకుంది.. ఆమె భర్త కరుణాకర్ (karunakar).. ఆటో నడుపుతాడు. వీరికి 2003లో పెళ్లి అయ్యింది. డిగ్రీ చేసే సమయంలో షీలకు వివాహా మైంది. ఆమెకు చదువు పట్ల ఉండే ఆసక్తిని భర్త గమనించాడు. పెళ్లైన తర్వాత కూడా స్టడీ కంటిన్యూ చేయించాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటర్ చదివే పాప, ఇంజినీరింగ్ చేసే బాబు ఉన్నారు. వారిద్దరీతోపాటు షీలను కూడా చదివించాడు.
డిగ్రీ, తర్వాత పీజీ
డిగ్రీ చేసిన తర్వాత ఎంకామ్ పీజీ రెగ్యులర్‌గా చేసింది షీలా (sheela). తర్వాత డిస్టన్స్‌లో మరో పీజీ పూర్తి చేసింది. 2016లో ఏపీ సెట్ క్వాలిఫై అయ్యింది. తర్వాత పీహెచ్డీ చేసింది. డాక్టరేట్ పట్టా కోసం వేయి కళ్లతో ఎదురు చూసింది. ఆ కల ఇప్పుడు నెరవేబోరబోతుంది. గవర్నమెంట్ టీచర్ కావాలనేది ఆమె లక్ష్యం అట.. ఆ దిశగా పీహెచ్డీ పూర్తి చేసింది. తెనాలిలోని వీఎస్ఆర్ అండ్ ఎస్వీఆర్ కాలేజీలో ప్రస్తుతం కామర్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. పట్టా తీసుకొని.. లెక్చరర్‌గా మారబోతున్నారు.
పీహెచ్డీ
ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత అనే అంశంపై షీల (sheela) పరిశోధన చేసింది. డాక్టర్ నంబూర్ కిషోర్ మార్గదర్శకంలో పరిశోధనను పూర్తి చేసింది. ఆచార్య నాగార్జున వర్సిటీ నుంచి ఈ రోజు పట్టా తీసుకున్నారు. అలా షీల (sheela) చిరకాల వాంఛ నెరవేరింది. తమ కోసం భర్త నిరంతరం కష్టపడ్డారని గుర్తు చేసింది. తాను ఏం సాధించినా దానికి కారణం ఆయనే.. ఆ ఘనత భర్తకే దక్కుతుందని అంటోంది. నిజమే.. ఇంట్లో ఉన్న భార్యను.. ఇంటి పని, వంట పని చేయాలని అనకుండా.. చదివించాడు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచాడు కరుణాకర్. ఈ రోజుల్లో కరుణాకర్ లాగా ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు.