Bihar wife killed her husband for not making Insta reels
Instagram Reels: ఇన్స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) వద్దన్నందుకు ఓ ఇళ్లాలు కట్టుకున్న భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. అక్కాచెల్లెళ్ల సాయం తీసుకొని హస్బెండ్ గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని (Bihar) బెగుసరాయ్‌లో జరిగింది. మహేశ్వర్ కుమార్ రాయ్ (25), రాణి కుమారి ఇద్దరు భార్యాభర్తలు. కోల్‌కతాలో కాపురం ఉంటున్నారు. అక్కడే దినసరి కూలీగా పని చేసేవాడు రాయ్. ఇటీవలే సొంతగ్రామానికి వచ్చారు. ఎప్పటినుంచో భార్య సోషల్ మీడియా రీల్స్ చేస్తుండేది. చాలా సార్లు వద్దని చెప్పినా వినిపించుకోలేదు రాణి. స్వగ్రామానికి వచ్చాక రీల్స్ చేయకని వారించాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో భర్తపై కక్ష పెట్టుకుంది.
పథకం ప్రకారం భర్తను పుట్టింటికి తీసుకెళ్లింది. అక్కడ రాణి తన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో ప్లాన్ చేసింది. భర్త పడుకున్నది చూసి ముగ్గురు కలిసి గొంతు కోసి చంపేశారు. ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత మృతుడి సోదరుడు ఫోన్ చేశాడు. రాయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతనికి అనుమానం వచ్చి తండ్రిని పంపించాడు. దీంతో అసలు విషయ వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.