»Haryana Road Accident Delhi Police Inspectors Dies In Car Truck Collision
Road Accident : కారు, ట్రక్కు ఢీ.. ఇద్దరు పోలీసు ఇన్స్పెక్టర్ల మృత్యువాత
హర్యానాలోని సోనిపట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి-44పై సోనిపట్ గుండా వెళుతుండగా పయౌ మనియారి సమీపంలో అర్థరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరణించారు.
Road Accident : హర్యానాలోని సోనిపట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి-44పై సోనిపట్ గుండా వెళుతుండగా పయౌ మనియారి సమీపంలో అర్థరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరణించారు. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఝజ్జర్‌లోని బహదూర్‌ఘర్‌లోని దాదన్పూర్ గ్రామానికి చెందిన దినేష్ బెనివాల్, జింద్‌లోని నర్వానా నివాసి రణబీర్ చాహల్ ఢిల్లీ పోలీస్‌లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. దినేష్ బెనివాల్ ఢిల్లీలోని హైదర్‌పూర్ నార్త్ వెస్ట్ స్పెషల్ సెల్లో, రణధీర్ చాహల్ ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేయబడ్డారు. వారిద్దరూ వెన్యూ కారులో ఢిల్లీ నుంచి సోనిపట్ వైపు అర్థరాత్రి వస్తున్నారు. దినేష్ బెనివాల్ కారు నడుపుతున్నాడు. రాత్రి 11:30 గంటల సమయంలో అకస్మాత్తుగా అతని ముందున్న ట్రక్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో అతని కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతినగా ఇన్స్పెక్టర్లు ఇద్దరూ చనిపోయారు.
సమాచారం అందుకున్న కుండ్లి పోలీస్ స్టేషన్‌లోని ఎస్ఐ కటార్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను సివిల్ ఆసుపత్రికి తరలించారు. కారు ముక్కలైందంటే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అంచనా వేయవచ్చు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.