Asaduddin Owaisi Interesting Comments On AP Politics
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్లింలు అంతా ఒక్కటే ఓ నేతను ఎన్నుకోవడం ఆ పార్టీలు/ నేతలకు నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులాలకే ఇంపార్టెన్స్ అని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం లేదని చెప్పారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, హిందువుల్లో మైనార్టీలు ఒక్కటై, రాజకీయాల్లోకి రావడం వారికి నచ్చదన్నారు. ప్రధాని మోడీపై అసదుద్దీన్ విమర్శలు చేశారు. గాంధీని చంపిన గాడ్సేపై సినిమా తీస్తున్నారని తెలిపారు. ఆ మూవీని దేశంలో బ్యాన్ చేస్తారా? లేదా? అని అడిగారు.
హైదరాబాద్‌లో తల్వార్లు, కత్తులతో దాడులు జరుగుతున్నాయి. ‘స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌కు ఒవైసీ కోరారు. దాడులకు తెగుబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెయిల్ రాకుండా చూడాలన్నారు. పీడీ యాక్ట్ లాంటి కఠిన చట్టాలు తీసుకోవాలి’ అని సీపీని అసదుద్దీన్ ఒవైసీ కోరారు.
సీఎం కేసీఆర్‌తో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభ వేదికపై కనిపించలేదు. కేసీఆర్ కావాలనే ఖమ్మం పిలవలేదా? ఇతర కారణం ఏమైనా ఉందా తెలియలేదు. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్తో దోస్తి అని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించేవి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నట్టు అసదుద్దీన్ చర్యల ద్వారా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలపై ఆయన విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ మైనార్టీలను ఏ రాజకీయ పార్టీ దగ్గరకు తీయడం లేదని ఆయన అంటున్నారు.