»Minister Ktr Should Resign As Responsible For Deaths Bandi
Bandi Sanjay : మరణాలకు బాధ్యతగా మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి
హైదరాబాద్ (Hyderabad) లో వర్షాలు మరో ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడ(Kalasiguda) లో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది. ఈ విషాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు.
హైదరాబాద్ లో వరుస మరణాలకు బాధ్యత వహిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.‘సికింద్రాబాద్(Secunderabad) కళాసిగూడలో పదేళ్ల మౌనిక తన సోదరుడికి సహాయం చేయాలనే ప్రయత్నంలో కాలువలో పడి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు.
ఇది కచ్చితంగా ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యంగానే జరిగిందన్నారు. మున్సిపల్ (Municipal) అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేల్కొనాలంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? డ్రోన్ షాట్ల ఫాంటసీ ప్రపంచం ఈ వాస్తవాలను దాచిపెడుతుంది.
అన్ని ఓపెన్ డ్రెయిన్లు (Open drains) మ్యాన్హోల్లను తక్షణమే సమీక్షించి, మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని భద్రపరిచేలా చూడాలని రాష్ట్ర బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన మౌనిక(Maunika) కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సంజయ్ ట్వీట్ చేశారు.