NLG: త్రిపురారం మండలం మాటూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించేందుకు మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ జేసీబీని విరాళంగా మంగళవారం అందించారు. ఈ సందర్భంగా గురుస్వామి బాల ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో వస్త్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు.