JGL: జగిత్యాల జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. అర్హత, ఆసక్తి గలవారు ఈనెల 16, 17న ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ధ్రువపత్రాలతో మేడిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సంప్రదించాలన్నారు.