NGKL: అక్టోబరు 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.