SRCL: తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ 33/11 కేవీ సబ్ప్టేషన్లో నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని సెస్ ఏఈ మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా లక్ష్మీపూర్, అంకుశాపూర్, పాపాయపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.