»Metro Train Stopped Due To Technical Fault Once Again
Hyderabad Metro : సాంకేతిక లోపంతో మరోసారి నిలిచిన మెట్రో రైలు
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ మార్గంలో మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు (Metro train) పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేక కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో నేడు కదలనని మెండికేసింది. సాంకేతిక లోపంతో మెట్రో చక్రం ముందుకు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
సాంకేతిక లోపంతో హైదరాబాద్ మెట్రో ట్త్రెన్ మరో సారి నిలిచిపోయింది. సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ వద్ద రైలు ఆగిపోవడంతో ఎంజీబీఎస్(MGBS), జేబీఎస్ మార్గంలో వెళ్లే సర్వీసులు (Services) నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు తిరిగి బయల్దేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. సులువుగా ప్రయాణించేదుకు భాగ్యనగర వాసులు తొందరగా గమ్యాన్ని చేరేందుకు మెట్రో ఉపయోగపడుతుండటంతో మెట్రో ప్రయాణించేందుకు సుముఖత చూపుతున్న నేపత్యంలో మెట్రో ఆగిపోవడంతో ప్రయాణకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.