బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ నేతల వివాదంలో ఇప్పుడు పవన్ తల దూర్చారు. దీంతో... వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్... ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు(harish rao) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులంతా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై పవన్(pawan kalyan) స్పందించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. వారు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రజలు వేరు.. పాలకులు వేరు. కానీ ఇలాంటి వివాదాల్లోకి ప్రజలను, జాతిని లాగడం సరికాదన్నారు. ఎప్పుడైతో ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకున్నాడో…. అప్పటి నుంచి పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
తాజగా ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు స్పందించారు. ఏపీ మంత్రులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణను, తెలంగాణ ప్రజలను తక్కువ చేసేలా తమ మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. పవన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అభివృద్ధి గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడితే దానికి సమాధానంగా తెలంగాణలో పరిస్థితి గురించి ఏపీ మంత్రులు మాట్లాడారని అన్నారు. ఏపీ మంత్రులనుద్దేశించిన చెప్పిన మాటలను వెనక్కి తీసుకొని ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని శేషు డిమాండ్ చేశారు.