మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సోదాల్లో భాగంగా… ఆయన ఫోన్ ని కూడా…. అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్నారని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ల బ్యాంకు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మల్లారెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్కనే సెల్ ఫోన్ ను సిబ్బంది దాచగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ స్వాధీన పరుచుకోవడంతో ఎలాంటి కీలక సమాచారం ఐటీ అధికారులు సేకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతో పాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తాళాలు లేవని చెప్పడంతో బీరువాలు, లాకర్లను అక్బర్ అనే వ్యక్తితో ఓపెన్ చేయించారు. అందులో కొన్ని బట్టలు ఇతర సామాగ్రి మాత్రమే ఉన్నాయని నగదు దొరకలేదని చెప్పినట్లు తెలుస్తోంది.