తెలంగాణలో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ కేసులో…జగ్గు స్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పరారవ్వడంతో… ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో నిన్న అడ్వకేట్ శ్రీనివాస్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోమారు సిట్ ఎదుట శ్రీనివాస్ హాజరుకానున్నారు.
జగ్గుస్వామితో పాటు మరో ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది.