Jio Extra Data: జియో సరికొత్త ఆఫర్.. అదనపు డేటా పొందండి
మార్కెట్లో దూసుకుపోతున్న జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో మరో అద్భతమైన ఆఫర్ తీసుకొచ్చింది. డేటా అయిపోతుంది అనేవారికి ఇది పెద్ద శుభవార్తే.
Jio Extra Data: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) మార్కెట్లో ఎలా దూసుకుపోతుందో చూస్తునే ఉన్నాము. ఈ పోటీ గేమ్‌లో జియో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల(Jio Prepaid Plan)కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో అందిస్తున్న రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రోజుకు 3 జీబీతో 84 జీబీ డేటా వస్తుంది. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ ప్లాన్‌ను తీసుకునే వినియోగదారులకు అదనంగా 6జీబీ డేటా పొందొచ్చు.
అలాగే జియో అందించే మరో ప్లాన్ రూ.219 రీఛార్జితో 14 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. రీసెంట్ ఆఫర్‌తో 2జీబీ డేటా అదనంగా పొందొచ్చు.