»Himanshu Who Adopted The School And Provided Facilities
Himanshu: పెద్ద మనసు చాటుకున్న కేటీఆర్ కొడుకు..స్కూల్ కోసం ఏం చేశాడంటే
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఆ స్కూలును రీఇన్నోవేషన్ చేయించారు. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించారు.
సీఎం కేసీఆర్(CM KCR) మనవడు హిమాన్షు(Himanshu) మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మంచి పనులు చేస్తూ తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. తాజాగా ఓ ప్రభుత్వ స్కూలును కేటీఆర్(KTR) తనయుడు హిమాన్షు దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కోటి రూపాయల ఖర్చుతో గచ్చిబౌలి కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను డెవలప్మెంట్ చేశారు.
హిమాన్షు చేసిన ట్వీట్:
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰
కార్పొరేట్ స్థాయిలో స్కూలును రీఇన్నోవేషన్ చేయించారు. నేడు హిమాన్షు పుట్టిన రోజు(Himanshu Birthday) సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం స్కూలుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హిమాన్షు షేర్ చేశారు. ప్రభుత్వ స్కూలుకు సాయం చేసిన సీఎం కేసీఆర్(CM KCR) మనవడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గచ్చిబౌలి కేశవనగర్లోని ప్రాథమిక పాఠశాలకు హిమాన్షు(Himanshu) గతంలో చాలాసార్లు వెళ్లాడు. పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల కోసం అక్కడి సౌకర్యాలను మెరుగుపరచాలనుకున్నాడు. అందుకోసం ఆ స్కూలును దత్తత తీసుకున్నాడు. క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్(సీఎఎస్) అధ్యక్షుడిగా కోటి రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు బెంచీలు, టాయిలెట్లు నిర్మాణం, భోజనం గది, ఆట స్థలం వంటి సౌకర్యాలను అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్(Ramulu yadav)తెలిపారు.