రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రోడ్డున పక్కన మక్కలు కొంటూ కనిపించారు. కంకులు అమ్మే మహిళ కాసేపు మాట్లాడి వారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నుంచి జగిత్యాల (Jagityala) వెళ్తున్న కవిత మార్గ మధ్యంలో నూకపల్లి దగ్గర కారు ఆపారు. రోడ్డు పక్కన కంకులు అమ్ముతున్నఆమె దగ్గరకు వెళ్లారు. నీ పేరేంటి, మీది ఏ ఊరు, కంకి ఎంత, రోజుకు ఎన్ని కంకులు అమ్ముతావు, ఎంత లాభం వస్తుందని మహిళను అడిగి తెలుసుకున్నారు. చాలా మందిమి ఉన్నాం నీ దగ్గర ఉన్న కంకులు సరిపోతాయా అంటు మహిళను అడిగారు. సీఎం కేసీఆర్ (CMKCR) పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాటి పాలనకు తెలంగాణ ఉన్న తేడాను కొమురమ్మ వివరించింది.
తనకే కాదు ఇంటింటికి పింఛన్, పలు సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్ మంచిగిస్తుండని కొమురమ్మ సంబురంగా చెప్పింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి (Sweet corn) కొనుగోలు చేయడంతో పాటు మాట కలపడంతో కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత.ఈ విషయాన్ని కవిత తన ట్విట్టర్లో కూడా ప్రస్తావించారు. కొమురమ్మ దగ్గర తియ్యటి మొక్క జొన్న కొన్నానంటూ గుర్తు చేసుకున్నారు.జగిత్యాలలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ (MLC L Ramana) తండ్రి ఎల్ గంగారం (ఎల్ జీ రాం) గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్జీ రాం హెల్త్‌కేర్ సొసైటీ ద్వారా ఎల్ గంగారం గారు చాలా సేవలందించారని అన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. pic.twitter.com/4pd4Xagdqo