ఫ్రాన్స్ దేశం నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు(Rafale fighter jets), మూడు స్కార్పెన్ క్లాస్ సాంప్రదాయ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను రక్షణ దళాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ముందు ఉంచాయని, ప్రధాని మోదీ ఈ వారంలో జరిపే ఫ్రాన్స్ (France) పర్యటన సందర్భంగా ఈ డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం.. భారత నావికా దళానికి 22 సింగిల్ సీట్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు నాలుగు ట్రైనర్ విమానాలు లభిస్తాయి. ఈ డీల్ విలువ రూ.90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే.. తుది ఒప్పందం తర్వాతే ఖర్చు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అయితే కాంట్రాక్టు చేపట్టిన తరువాతే పూర్తి ఖర్చుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భారత్ (India) ఈ ఒప్పందంలో రాయితీలను కోరే అవకాశం ఉంది. గతంలో 36 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లే రాఫెల్ డీల్‌కు సంబంధించి భారత్, ఫ్రాన్స్‌లు (Frances) సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలు ఉన్నతాధికారుల దగ్గర ఉన్నాయి. మొత్తంగా అధునాతన రక్షణ విమానాలు అందుబాటులోకి వస్తే భారత్‌కు అదనపు బలం చేకూరనుంది.సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్‌కు యుద్ధ విమానాలు, జలాంతర్గాముల కొరత కూడా వేధిస్తోంది. దీంతో వీటిని అత్యవసరంగా కొనుగోలు చేయాలని నావికా దళం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య(Vikramaditya), విక్రాంత్ మిగ్-29లను నడుపుతున్నాయి. ఈ రెండు వాహకాలపై కార్యకలాపాలకు రాఫెల్‌లు అవసరం. ప్రాజెక్ట్ 75లో భాగంగా నేవీ రిపీట్ నిబంధన కింద మూడు స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్లను కొనుగోలు చేయాల్సి ఉంది. వీటిని ‘మేక్ ఇన్ ఇండియా(Make in India)’లో భాగంగా ముంబైలోని మజాగాన్ డాక్ యార్డ్స్ లిమిటెడ్‌లో నిర్మిస్తారు.