Komatireddy Venkat Reddy Made Sensational Comments
Komatireddy Venkat Reddy: మరో 45 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు కాబోతుందని అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) బాంబ్ పేల్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాజీలు కాబోతున్నారని చెప్పారు. గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు రూ.2 వేల కోట్లతో నేషనల్ హైవేని కేంద్రమంత్రి ద్వారా తానే మంజూరు చేయించానని వివరించారు. జాతీయ రహదారులను స్థానిక ఎంపీ అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అదీ కూడా తెలియదని చెప్పారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద నేషనల్ హైవే నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు.
గల్లీల్లో తిరిగే గాదిరి కిషోర్‌కు ఢిల్లి ఎక్కడ ఉందో తెలుసా.? జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా సంపాదించిన రూ.3 వేల కోట్లతో శంషాబాద్ వద్ద 80 ఎకరాల భూమి కొనుగోలు చేశాడని వెంకట్ రెడ్డి (Venkat Reddy) ఆరోపించారు. అక్రమ సంపాదనలో కిశోర్, జగదీశ్ రెడ్డి పోటీ పడుతున్నారని విమర్శించారు. తనను బెంజ్ కారులో తిరుగుతారని విమర్శలు చేస్తారని.. యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. 30 ఏళ్ల క్రితమే బెంజ్ కారులో తిరిగానని గుర్తుచేశారు. కష్టపడి, వ్యాపారం చేసి సంపాదించానని తెలిపారు.
జగదీష్ రెడ్డి మాత్రం స్కూటర్ మీద తిరిగి.. ఇప్పుడు వేల కోట్లు సంపాదించాడని వెంకట్ రెడ్డి (Venkat Reddy) ఆరోపించారు. తెలంగాణలో అక్రమాలు ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఎవరున్నా.. తొలి సంతకం మాత్రం రూ.4 వేల పెన్షన్ మీద పెడతాం అని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ పాల్గొనే సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. 4 పార్టీలు మారిన సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతాడని.. ప్రాణం భయం ఎందుకు అని అడిగారు.