తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5 శాతం డీఏ (DA)ను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Govardhan) తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను ఆర్టీసీ చెల్లించనుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని.. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
సెప్టెంబర్ (September) నెల వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, పెండింగ్ బకాయిలను త్వరలో ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని 2023 జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(MD VC Sajjanar), ఐపీఎస్ తెలిపారు.