ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛన్ తీసుకోకుంటే నిలిపివేసేవారని, కూటమి ప్రభుత్వంలో రెండు మూడు నెలలది కలిపి ఇస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.