KMM: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొని కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి మిఠాయి పంచుకున్నారు.