జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఇవాళ పెగడపల్లి, కొండయ్యపల్లి, గొల్లపల్లి, రాపల్లెలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం నాణ్యత ప్రమాణాలను పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కొనుగోళ్లు కేంద్రాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DSO జితేందర్ రెడ్డి, డీసీవో మనోజ్ కుమార్, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.