మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో బుధవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకలలో హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా రప్పించినటువంటి దున్నపోతులు ప్రజలను అలరించాయి. ఈ విన్యాసాలను చూసిన వారు హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సదరు వేడుకలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.