KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా, విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా. కోడూరి శ్రీవాణిని ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకుంటారు.