KMM: నేలకొండపల్లికి చెందిన మెట్టెల వెంకన్న అనే కాపరికి వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందడంతో తీరని నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి కుక్కల గుంపు దాడి చేయడంతో సుమారు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో తమకు రూ. 2.5 లక్షలపైగా నష్టం జరిగిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. నష్టపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.