WGL: సంగెం మండలం తిమ్మాపురంలో దాసరి కట్టయ్య అప్పు భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకున్న కట్టయ్యపై వాయిదాల కోసం ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వంశీకృష్ణ తెలిపారు.