VKB: స్టేషన్ ధారూర్ నుంచి వయా నాగారం, మోమిన్ కలాన్, మీదిగా వికారాబాద్ వరకు రూ.90 కోట్లతో నూతన డబుల్ రోడ్డు మంజూరు అయింది. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రోడ్డుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేసి 6 నెలలు అయినా ఇంకా పనులు ప్రారంభించలేదు.