NRML: కడెం మండలంలోని దోస్తు నగర్ అటవీ ప్రాంతంలో ట్రైనీ బీట్ అధికారులు పర్యటించారు. హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీట్ అధికారులు గురువారం కడెం మండలంలోని దోస్తు నగర్ నుంచి మైసంపేట్ పునరావాస కేంద్ర కాలనీ వరకు నడిచారు. వారికి అటవీ సంరక్షణ, అధికారుల విధులు, తదితర అంశాలపై అటవీ అధికారులు అవగాహన కల్పించారు.