SRPT: అదుపుతప్పి ఆటో బోల్తా పడటంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల నుండి మోతే వెళుతున్న ఆటో మార్గం మధ్యలో, వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.