SRPT: కోదాడ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ 1981-82 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయంగా సమావేశమయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం తాము చదివిన పాఠశాలకు వెళ్లి ఆనాటి గుర్తులను నెమరువేసుకున్నారు.