JGL: రాయికల్ పట్టణంలోని 3వ వార్డులో అద్దె ఇంట్లో నివాసముంటున్న ఓ నిరుపేద మహిళ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందింది. ఆ మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకురావడానికి యజమాని నిరాకరించాడు. దీంతో భూక్యా రాకేష్ నాయక్, తురగ శ్రీధర్ రెడ్డి మున్సిపల్ వైకుంఠ వాహనం, జేసీబీ యంత్రం సమకూర్చి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.