KMM: గణేష్ నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ నాయుడుపేట మున్నేరు సమీపంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్‌ను, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం ఉదయం నుంచి గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉంటుందన్నారు.