KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట పొలిమేర నుంచి గొల్లపల్లి స్మశాన వాటిక వరకు వెళ్లే నక్ష దారి కబ్జాకు గురైందని గొల్లపల్లి సర్పంచ్ స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన సర్పంచ్, క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. దారి లేక రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.