BHNG: చౌటుప్పల్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభించాలని CPM పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు. హైవే ప్రమాదాలు పెరుగుతున్నా సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.