MDK: రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. అయ్యప్ప స్వామి జన్మదిన జయంతి మహోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ఇటీవల తయారు చేయించిన బంగారు కిరీటం అలంకరణ, పట్టాభిషేకం కార్యక్రమాలను జరపుతామన్నారు.