MNCL: భీమారంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ ఇవాళ తెలిపారు. అక్రమంగా కొత్తగూడెం చెరువు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను అవడం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకొని డ్రైవర్ జీవన్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనుమతి లేనిది ఇసుక రవాణా చేయకూడదని SI హెచ్చరించారు.