NZB: గ్రామ వార్డు సభల నిర్వహణకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ ఉ.7.30 గం. నుంచి 10.30 గం.లోపు సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను సమాయత్తం చేశామన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ జిల్లాలో సభలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.