BDK: గుండాల మండలంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక రవాణాకు వినియోగిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గుండాలకి చెందిన పాషాగా గుర్తించారు. ఇసుక కోసం కిన్నెరసాని వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు అయిందన్నారు.