HYD: పోక్సో కేసు (Protection of Children from Sexual Offences Act) కింద నేరం నిరూపితమైతే తీవ్రమైన శిక్షలు తప్పవని HYD ట్రై కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు. చిన్నారులపై లైంగిక దాడి, వేధింపులు, దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయితే, కేసు తీవ్రత ఆధారంగా నిందితుడికి జీవితాంతం జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువన్నారు.