SRPT: కోదాడ ఆర్టీసీ డిపో నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు డిపో అభివృద్ధికి సహకారం అందించాలని కోదాడ డీఎం శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం డిపోలో నూతనంగా ఎన్నికైన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు డిఎం శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీఎంకు అందజేశారు.