ASF: కాగజ్ నగర్లో స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై శుక్రవారం దాడులు చేశారు. స్వాగత్ హోటల్, న్యూ స్వాగత్ రెస్టారెంట్ వెనుక షెడ్లలో 5 డొమెస్టిక్ LPG సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.