RR: నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ రాజునాయక్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రజల సహకారంతో మేకగూడను ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు.