VKB: పరిగి మండల పరిధిలోని కాడ్లాపూర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు వినూత్న నిరసనకు వేదికయింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో రైతులందరూ కలిసి అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి మొరపెట్టుకున్నారు.