SRD: సదాశివపేట పట్టణంలో కాశమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ మాణిక్ రావు ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరిని దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.