WGL: జిల్లా నర్సంపేట బస్టాండ్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు వేములవాడ నుంచి హన్మకొండకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న కీసర రజిత అనే మహిళ తన పర్సును పోగొట్టుకుంది. అందులో ఆధార్ కార్డు, 7200 రూపాయలు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. బస్సు డ్రైవర్ సహకారంతో బస్టాండ్ కంట్రోలర్ మల్లికార్జున్ ఆ పర్సును గుర్తించి, ప్రయాణికురాలికి అందజేశారు.