Powerful 7.5-Magnitude Earthquake Strikes Mindanao In Philippines
Sangareddy : సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం పలుచోట్ల భూమి కంపించింది. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని న్యాల్ కల్, ముంగి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు ఇళ్లనుంచి భయంతో పరుగులు తీశారు. కాగా.. ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి జనాలు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూకంపం సంభవిస్తుంది. ఈ నెల 10వ తేదీన అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 30 డిసెంబర్ 2023న మణిపూర్లో భూకంపం సంభవించింది. న్యూ ఢిల్లీలో అక్టోబర్ 3, 2023న భూకంపం వచ్చింది. ఆ సమయంలో దాదాపు 40 సెకన్ల పాటు భూకంపాలు సంభవించినట్లు భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్లో ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2023 ఫిబ్రవరి 19న భూకంపం సంభవించింది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్ల చెర్వు, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.